తిరుమల శ్రీవారిని తెలుగుదేశం అధినేత చంద్రబాబు దర్శించుకున్నారు. శ్రీ కృష్ణ అతిథి గృహం వద్ద తితిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఎమ్మెల్సీలు పయ్యావుల కేశవులు, సంధ్యారాణి చంద్రబాబు వెంటఉన్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు - తిరుపతిలో చంద్రబాబు పర్యటన
తెదేపా అధినేత చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రమణదీక్షితులు చేసిన వ్యాఖ్యలపై బాబు స్పందించారు. జగన్‌ను విష్ణుమూర్తితో పోల్చడం బాధాకరమన్నారు. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు
రమణదీక్షితుల వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
జగన్‌ను విష్ణుమూర్తితో పోల్చడం బాధాకరం. దేవుడు దేవుడే.. మనిషి మనిషే.. మనిషి ఎప్పుడూ దేవుడు కాలేడు. భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశంపై వ్యాఖ్యలు బాధాకరం. గతంలోనూ తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా మాట్లాడారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిని మళ్లీ విధుల్లోకి తీసుకోవడం సరికాదు. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది- చంద్రబాబు
- ఇదీ చదవండి:పైశాచికం: సోదరుడని నమ్మితే కాలయముడయ్యాడు