తెలంగాణ

telangana

ETV Bharat / state

విశాఖ ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి

ఆంధ్రప్రదేశ్​ విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అత్యున్నత వైద్య సాయం అందించాలని సూచించారు. ఈ ఘటనపై లోకేశ్ విచారం వ్యక్తం చేశారు.

chandrababu-expressed-shock-over-the-visakha-gas-leak-event
విశాఖ ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి

By

Published : May 7, 2020, 9:52 AM IST

ఆంధ్రప్రదేశ్​ విశాఖ ఆర్.ఆర్.వెంటాపురం గ్యాస్ లీక్ ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు మృతి చెందడం, ఆస్పత్రి పాలవడం పట్ల చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన బాధాకరమన్నారు. మనుఘలే కాదు మూగజీవాలు కూడా మృతి చెందాయన్నారు. కొన ఊపిరితో ఉన్న ప్రజలను, మూగజీవాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

చెట్లన్నీ రంగుమారడం విషవాయు తీవ్రతకు నిదర్శమన్నారు. యుద్ధ ప్రాతిపదికన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. బాధితులకు అత్యున్నత వైద్యసాయం అందించాలన్న చంద్రబాబు.. సహాయ చర్యలు వేగపరిచి... కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు.

విశాఖ ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి

ఆర్.ఆర్.వెంకటాపురం ఘటన పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు.

ఇవీచూడండి:మందు భామలం మేము.. క్యూ కడతాము..!

ABOUT THE AUTHOR

...view details