తెదేపా అధినేత చంద్రబాబు ఏపీ ఉద్ధండరాయునిపాలెంలో అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని గురువారం సందర్శించారు. ప్రధాని మోదీ ఆవిష్కరించిన శిలాఫలకాన్ని పరిశీలించారు. యాగశాలలో హోమం జరిగిన ప్రదేశం వద్దే మోకాళ్లపై ప్రణమిల్లి ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. శంకుస్థాపనలో భాగంగా నవరత్నాలు పెట్టిన ప్రదేశాన్ని తిలకించారు.
రాజధాని శంకుస్థాపన స్థలిలో ప్రణమిల్లిన చంద్రబాబు - Amaravati farmers protest news
ఏపీ ఉద్ధండరాయునిపాలెంలో అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మట్టికి తెదేపా అధినేత చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేశారు. యాగశాలలో హోమం జరిగిన ప్రాంతంలో మోకాళ్లపై ప్రణమిల్లి ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
రాజధాని శంకుస్థాపన స్థలిలో ప్రణమిల్లిన చంద్రబాబు
శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో మట్టికి సాష్టాంగ నమస్కారం చేశారు. చంద్రబాబు వెంట అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ తదితరులు ఉన్నారు.
ఇదీ చూడండి:లైవ్ వీడియో: పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య