ఏపీ శాసనమండలిపై ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ వ్యాఖ్యలు దారుణమని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపారనే ఉక్రోశంతో శాసనమండలిని రద్దు చేయాలనుకోవడం అవివేకమని వ్యాఖ్యానించారు. మండలిని రద్దు చేసే అధికారం ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. ఆ అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికే ఉందని వివరించారు. మండలి రద్దు ప్రక్రియ పూర్తయ్యేందుకు ఒకటిన్నరేళ్లు పడుతుందని చెప్పారు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ మండలిని తీసుకొస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. మండలిలో వైకాపా నేతలు అరాచక శక్తులుగా ప్రవర్తించారని అగ్రహం వ్యక్తం చేశారు. మండలి ఛైర్మన్ షరిఫ్‌ను వ్యక్తిగతంగా దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలి ఛైర్మన్, తెదేపా ఎమ్మెల్సీలు రాష్ట్ర భవిష్యత్తు కోసం నిలబడ్డారని చంద్రబాబు కొనియాడారు.