మరఠ్వాడా ప్రాంతంలో ఉపరితల ద్రోణి ఏర్పడింది. అక్కడి నుంచి కర్ణాటక మీదుగా గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో శని, ఆదివారాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు పడొచ్చని వాతావరణశాఖ తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలో గరిష్ఠంగా మెదక్‌లో 41.6, ఆదిలాబాద్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. శుక్రవారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.
నేడు, రేపు రాష్ట్రంలో ఉరుములతో వర్షాలు - వర్షం తాజా వార్తలు
రాష్ట్రంలో శని, ఆదివారాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో అక్కడక్కడా వర్షాలు పడొచ్చని వాతావరణశాఖ తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.
వర్షాలు
నల్గొండ జిల్లా సింగరాజ్‌పల్లిలో అత్యధికంగా 4.4సెం.మీ., పడమలిపల్లె 3.4, వెల్దండ (నాగర్‌కర్నూల్ జిల్లా)లో 2.7 సెం.మీ. వర్షం కురిసింది. వర్షాలతో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో 10 వేల ఎకరాలు, మరో 8 జిల్లాల్లో 15 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. రెండు రోజులు వర్షాలు ఉన్నందున ధాన్యాన్ని అమ్మకానికి తీసుకురాకూడదని అధికారులు సూచించారు.
ఇదీ చదవండి: కొవిడ్ శవాలతో కాసుల వేట.. కనీసం రూ. 25వేలు లేకుంటే కష్టమే
Last Updated : Apr 24, 2021, 7:54 AM IST