తెలంగాణ

telangana

ETV Bharat / state

Chada Venkat Reddy : 'విభజన హామీలను కేంద్రం వెంటనే అమలు చేయాలి' - Chada Venkat Reddy news

Chada Venkat Reddy : ఎనిమిదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని కేంద్రం మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇకనైనా కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేని పక్షంలో తెలంగాణలో విభజన హక్కుల సాధనకై ఉద్యమిస్తామని హెచ్చరించారు.

CHADA VENKAT REDDY SPOKED
మాట్లాడుతున్న చాడా వెంకట్ రెడ్డి

By

Published : Feb 18, 2022, 2:25 PM IST

Chada Venkat Reddy : తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విభజన సమస్యలను పరిష్కరించి కేంద్రం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. లేకపోతే విభజన హామీల కోసం కేంద్రంపై ఉద్యమిస్తామని ఆయన అన్నారు.

పోడు భూముల సమస్య..

తెలంగాణలో పోడు భూముల సమస్య దినదిన గండంగా మారిందన్నారు. గిరిజనులు, ఆదివాసులు కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నారని వారిని వెళ్లగొట్టే కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. పోడు భూములకు సంబంధించి దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగానే రైతులపై దాడులు జరుగుతున్నాయని.. సీఎం కేసీఆర్ దీనిపై దృష్టి పెట్టాలని కోరారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ముఖ్యమంత్రి పునరాలోచణ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి :Harvard University invites KTR: హార్వర్డ్ సెమినార్​కు కేటీఆర్.. అందిన యూనివర్సిటీ ఆహ్వానం

ABOUT THE AUTHOR

...view details