గ్రామీణ ప్రాంతాల్లోకి కరోనా వైరస్ వ్యాప్తి చెందడం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించి ఇప్పుడు గాలికి వదిలేశాయని మండిపడ్డారు. ప్రభుత్వం ఆంక్షలు ఎత్తి వేయడంతో ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతున్నారని దీంతో కేసులు సంఖ్య పెరిగిపోతోందన్నారు.
గ్రామస్థాయిలోనూ కరోనా పరీక్షలు చేయాలి: చాడ - కొవిడ్-19 వార్తలు
గ్రామస్థాయిలోనూ కరోనా పరీక్షలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్సి చాడ వెంకట్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కరోనా వ్యాప్తి చెందడం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఆయన అన్నారు. కరోనాను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
గ్రామస్థాయిలోనూ కరోనా పరీక్షలు చేయాలి: చాడ
రాష్ట్ర ఆరోగ్య శాఖ సంచాలకుని ప్రకటన చూస్తే ఎలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నామో అర్ధమవుతుందన్నారు. కరోనా పరీక్షల ఫలితాల్లోనూ పారదర్శకత లేదని ఆరోపించారు. గ్రామస్థాయిలోనూ కరోనా పరీక్షలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కరోనాను అరికట్టడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: ప్రభుత్వం ప్రజల భద్రతను గాలికొదిలేసింది: కోదండరాం