హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని మఖ్దూం భవన్లో బిహార్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆర్కెస్ట్రా కళాకారులకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి నిత్యవసర సరకులు అందజేశారు. ఆ కార్మికులు వారి సమస్యలపై చాడకు వినతి పత్రం సమర్పించారు.
కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి : చాడ
కరోనాతో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులు, కళాకారులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. హిమాయత్‌నగర్ మఖ్దూం భవన్లో బిహార్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన కళాకారులకు ఆయన నిత్యావసరాలు పంపిణీ చేశారు.
వివిధ రాష్ట్రాల నుంచి పొట్టకూటి కోసం నగరానికి వచ్చిన ఈ కళాకారులకు కరోనాతో పూట గడవటం భారంగా మారిందని చాడ అన్నారు. పెళ్లిళ్లకు, ఇతర కార్యక్రమాలకు వీరిని ఎవరూ పిలవడం లేదన్నారు. ఉపాధి లేకపోవడం, ప్రభుత్వం అదుకోకపోవడం వల్ల వీరి బతుకులు భారంగా మారాయన్నారు. తక్షణమే వలస కార్మికులు, కళాకారుల కుటుంబానికి రూ.7500 ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు. వీరి సమస్యలపై త్వరలోనే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను కలవనున్నట్లు చాడ తెలిపారు.
ఇదీ చూడండి :పదేళ్ల ప్రాయం.. తల్లీచెల్లిని చక్రాల కుర్చీపై 250 కి.మీలు తీసుకెళ్లేంత ధీరత్వం