తెలంగాణ

telangana

ETV Bharat / state

గచ్చిబౌలి కరోనా ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలి: చాడ

కొవిడ్-19 చికిత్స కోసం గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన కొవిడ్​ ఆస్పత్రిని తక్షణమే ప్రారంభించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. కార్పొరేట్​ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు లక్షల రూపాయల ఫీజు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కరోనా నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని కోరుతూ.. మంత్రి ఈటల రాజేందర్​కు వినతిపత్రం అందజేశారు.

chada venkat reddy given petition to minister etala rajender on corona cases in telangana
తక్షణమే గచ్చిబౌలి కొవిడ్​ ఆస్పత్రి ప్రారంభించాలి: చాడ

By

Published : Jun 13, 2020, 7:14 PM IST

రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నా ఎందుకు గచ్చిబౌలిలోని కొవిడ్ ఆస్పత్రి ప్రారంభించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. భాగ్యనగరంలో కొవిడ్-19 వేగంగా విజృంభిస్తోన్న నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతూ.. బీఆర్​కే భవనంలో వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​కు వినతిపత్రం అందజేశారు.

గాంధీలో సరైన సౌకర్యాలు లేక కరోనా పేషెంట్​లు ఇబ్బంది పడుతున్నారు. కార్పొరేట్​ ఆస్పత్రుల్లో చూస్తే లక్షల రూపాయల కరోనా దోపిడీ జరుగుతోంది. ప్రజల్లో విశ్వాసం పెంచే విధంగా తక్షణమే గచ్చిబౌలి కొవిడ్​ ఆస్పత్రికి పేషెంట్లను పంపాలి. ముందస్తు చర్యల్లో భాగంగా హోమియోపతి మెడిసిన్ ఉచితంగా పంపిణీ చేయాలి.- చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

తక్షణమే గచ్చిబౌలి కొవిడ్​ ఆస్పత్రి ప్రారంభించాలి: చాడ

ఇదీ చూడండి:రాష్ట్రంలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు...

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details