బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా జోక్యం చేసుకొని నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒక వైపు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేస్తూ... ఎస్మా యాక్ట్ అంటూ వారిని హెచ్చరించే విధంగా సీఎం వ్యవహారించడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో సమ్మె చేసే హక్కు ఉందని... దానిని హరించే విధంగా పంతాలకు పట్టింపులకు పోకుండా ఆర్టీసీ ఐకాస నాయకులతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకోవాలని చాడ సూచించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులపై ముఖ్యమంత్రి అసహానానికి, ఆగ్రహానికి గురికాకుండా సమ్మె నివారణకు పూనుకోవాలని చాడ కోరారు.
పంతాలకు.. పట్టింపులకు పోకుండా సమస్యను పరిష్కరించండి
ఆర్టీసీ కార్మికులపై ముఖ్యమంత్రి కేసీఆర్ పంతాలకు పట్టింపులకు పోకుండా కార్మిక సంఘాల నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి సూచించారు.
ఆర్టీసీ సమ్మెపై స్పందించిన చాడ
Last Updated : Oct 6, 2019, 8:05 AM IST