రాష్ట్రంలో జీఎస్టీ పరిధిలో 4.71 లక్షల మందికి వ్యాపార, వాణిజ్య సంస్థలు ఉన్నాయి. కేంద్ర జీఎస్టీ పరిధిలో 1.87 లక్షల వ్యాపార, వాణిజ్య సంస్థలు ఉన్నాయి. 2019- 20 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లో వీటినుంచి నిర్ధేశించిన లక్ష్యం మేరకు రూ. 9, 949 కోట్లు రావాల్సి ఉండగా 5.93 శాతం తగ్గి రూ.9, 359 కోట్ల రాబడి వచ్చింది. ఇంటిగ్రేటడ్ జీఎస్టీ మొదటి ఆరు నెలల్లో లక్ష్యం రూ.1, 615 కోట్లు కాగా 17.22 శాతం తగ్గి రూ.1, 333 కోట్లు మాత్రమే వసూలైంది. కస్టమ్స్ సుంకం కింద.. 942 కోట్లు వసూలు కావాల్సి ఉండగా రూ.695 కోట్లు మాత్రమే వచ్చింది. ఇది గతంలో కంటే 26.22 శాతం తక్కువ. సెంట్రల్ ఎక్సైజ్ రెవెన్యూ కింద మొదటి ఆరు నెలల్లో రూ.157 కోట్లు రావాల్సి ఉండగా 45.86 శాతం మేర తగ్గింది. ఈ సారి రూ.87 కోట్లు మాత్రమే వసూలైనట్లు కేంద్ర జీఎస్టీ అధికారుల లెక్కలు వెల్లడిస్తున్నాయి.
ఆర్థిక మాంద్యం ప్రభావం...