తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతుబంధు, డీఏ చెల్లింపుల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాం : సీఈవో

CEO Vikas Raj Meeting at BRK Bhavan in Telangana : తెలంగాణలో శాసనసభ ఎన్నికల పరిస్థితిని సీఈవో వికాస్​రాజ్​ వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే దాదాపుగా ఓటర్​ స్లిప్​లను పంపిణీ చేశామని తెలిపారు. హైదరాబాద్​లోని బీఆర్కే భవన్​లో నిర్వహించిన సమావేశంలో ఆయన అందుకు తగిన వివరాలను వెల్లడించారు.

Vikas Raj
CEO Vikas Raj Meeting at BRK Bhavan in Telangana

By ETV Bharat Telangana Team

Published : Nov 23, 2023, 5:05 PM IST

Updated : Nov 23, 2023, 7:30 PM IST

CEO Vikas Raj Meeting at BRK Bhavan in Telangana : రైతుబంధు, డీఏ చెల్లింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన వివరణలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపామని, ఈసీ అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్(CEO Vikas Raj)​ తెలిపారు. పోలింగ్ కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయని.. ప్రస్తుతం హోం ఓటింగ్(Home Voting in Telangana)​, ఫెసిలిటేషన్ కేంద్రాల్లో పోస్టల్ ఓటింగ్ జరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో మొదటిసారి మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉందన్న సీఈవో ఓటర్ల నిష్పత్తి 1000:1002 గా ఉన్నట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం బ్యాలెట్లు, టెండర్, చాలెంజ్ ఓట్ల కోసం బ్యాలెట్లు కలిపి మొత్తం 14 లక్షలకుపైగా ముద్రణ పూర్తయిందనని.. రేపటితో ఈవీఎం, వీవీప్యాట్​ల కమిషనింగ్ పూర్తవుతుందని చెప్పారు. హైదరాబాద్​లోని బీఆర్కే భవన్​లో ఆయన సమావేశం నిర్వహించారు.

Telangana Election Polls 2023 :35,655 పోలింగ్ కేంద్రాలు(Telangana Election) ఉండగా.. 59,779 బ్యాలెట్ యూనిట్లు వాడుతున్నట్లు వికాస్ రాజ్ వివరించారు. అభ్యర్థులకు ఓటరు జాబితాలు అందించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 51 లక్షల ఓటరు గుర్తింపు కార్డులు ముద్రించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 86 శాతం ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పుల పంపిణీ పూర్తయిందని ఎన్నికల ప్రధాన అధికారి వివరించారు. ఒకటి, రెండు రోజుల్లో స్లిప్పుల పంపిణీ పూర్తవుతుందన్నారు. 9 చోట్ల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఆరు నియోజకవర్గాల్లో 500కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, అక్కడ కౌంటింగ్ కేంద్రాల్లో టేబుళ్లు రెట్టింపు సంఖ్యలో ఉంటాయని సీఈఓ తెలిపారు. సువిధ యాప్ ద్వారా అనుమతుల కోసం 37,422 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు.

పరిశోధనలో గెలిచారు ప్రజాక్షేత్రంలో నిలిచారు తెలంగాణ ఎన్నికల బరిలో పీహెచ్​డీ పట్టాదారులు

"ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద 777 కేసులు నమోదు అయ్యాయని, అందులో 166 ప్రలోభాలకు సంబంధించి కేసులు ఉన్నాయి. నమూనా పోలింగ్ స్టేషన్లు, యువత, దివ్యాంగులు నిర్వహించే పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. పోలింగ్ రోజు సెలవు రోజుగా చూడరాదన్న.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎన్నికల విధుల్లో 40 వేల రాష్ట్ర పోలీసులు, 25 వేల ఇతర రాష్ట్రాల పోలీసులు, 375 కంపెనీల కేంద్ర బలగాలు ఉంటాయి. శాంతి భద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులను ఆదేశించాను."-వికాస్​రాజ్​, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి

C Vigil App in Election Commission : సీ జిల్ యాప్​ను ఇప్పటి వరకు 6648 మంది వినియోగించినట్లు సీఈవో వికాస్​రాజ్​ చెప్పారు. ఈవీఎంలు తీసుకెళ్లే ప్రతి వాహనానికి జీపీఎస్ సౌకర్యం ఉంటుందని అన్నారు. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న మొత్తం రూ.669 కోట్లుగా పేర్కొన్న వికాస్ రాజ్... స్వాధీనాలకు సంబంధించి 10,106 ఎఫ్​ఐఆర్​లు నమోదు చేసినట్లు ప్రకటించారు.

రైతుబంధు, డీఏ చెల్లింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాం

పకడ్బందీ చర్యలు, క్షేత్రస్థాయి కార్యాచరణతో ఫిర్యాదులు తగ్గుతూ వస్తున్నాయి : సీఈవో వికాస్​ రాజ్

election commission official 12 cards : ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్ అధికారికంగా​ ప్రకటించిన.. 12 గుర్తింపు కార్డులివే

Last Updated : Nov 23, 2023, 7:30 PM IST

ABOUT THE AUTHOR

...view details