తెలంగాణ

telangana

ETV Bharat / state

జీఎస్టీ పరిహారం కింద తెలంగాణకు రూ.129 కోట్ల రుణం

జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు కేంద్రం మరోసారి రుణాలు విడుదల చేసింది. పదో విడతలో భాగంగా తెలంగాణకు రూ.129.57 కోట్లు, ఏపీకి రూ.119.82 కోట్లను విడుదల చేసింది.

centre releases 10th installment gst Compensation to states
రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం విడుదల

By

Published : Jan 4, 2021, 10:09 PM IST

జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు పదో విడతగా రూ.6వేల కోట్ల రుణాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసింది. వీటిలో తెలంగాణకు రూ.129.57 కోట్లు, ఏపీకి రూ.119.82 కోట్లను విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటి వరకు అందజేసిన రుణాల్లో ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,433.25 కోట్లు, తెలంగాణకు రూ.947.73 కోట్లు కేంద్రం నుంచి రుణాలుగా అందాయి.

ఇప్పటి వరకు రూ.60 వేల కోట్లను రాష్ట్రాలకు కేంద్రం రుణంగా ఇచ్చింది. పదో విడతలో జీఎస్టీ అమలు కారణంగా ఏర్పడిన లోటును కేంద్రమే పరిహారం కింద ఇవ్వాల్సి ఉంటుంది. ఈసారి మొత్తాన్ని రూ.1.10 లక్షల కోట్లుగా అంచనా వేసి రుణాలుగా అందజేస్తోంది. ఇప్పటి వరకు సగానికి పైగా రుణాలను కేంద్రం రాష్ట్రాలకు అందజేసింది.

ఇదీ చదవండి: యాదాద్రి శివాలయంలో ప్రత్యేక పూజలు

ABOUT THE AUTHOR

...view details