తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో ముగిసిన కేంద్ర బృందం పర్యటన - cemtral team visit telangana

central-team-went-to-the-delhi
రాష్ట్రంలో ముగిసిన కేంద్ర బృందం పర్యటన

By

Published : May 3, 2020, 1:45 PM IST

Updated : May 3, 2020, 2:19 PM IST

13:37 May 03

రాష్ట్రంలో ముగిసిన కేంద్ర బృందం పర్యటన

రాష్ట్రంలో కరోనా నివారణ, సహాయ చర్యలు పరిశీలించడానికి వచ్చిన కేంద్ర బృందం పర్యటన ముగిసింది. ఏప్రిల్ 25న రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం 8 రోజులపాటు పర్యటించి... ఇవాళ ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్లింది. లాక్​డౌన్ అమలు తీరు పర్యవేక్షించిన బృంద సభ్యులు... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిలతో సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో సర్కారు తీసుకుంటున్న చర్యలు, కరోనా బాధితులకు ఆసుపత్రుల్లో అందిస్తున్న చికిత్స, వలస కార్మికుల నివాస ప్రాంతాలను పరిశీలించారు. ఇప్పటికే ప్రాథమిక రిపోర్టులో పలు సూచనలు, సలహాలు ఇచ్చిన కేంద్ర బృందం... దిల్లీ వెళ్లాక.. పూర్తిస్థాయి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించనుంది.

ఇవీ చూడండి: వైద్య దేవుళ్లకు పుష్పాభిషేకం.. వాయుసేన పూలవాన

Last Updated : May 3, 2020, 2:19 PM IST

ABOUT THE AUTHOR

...view details