కరోనా నివారణ చర్యలను ప్రత్యక్షంగా పరిశీలన లక్ష్యంతో భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ నేతృత్వంలోని కేంద్ర బృందం..... హైదరాబాద్ పర్యటన ముగిసింది. ఆదివారం సాయంత్రం రాష్ట్రానికొచ్చిన బృందం...... సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పర్యటించింది. తొలుత కరోనా చికిత్సకోసం......గచ్చిబౌలీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టిమ్స్‌ను సందర్శించింది. అక్కడి ఐసోలేషన్ వార్డు, ఐసీయూ గదులను పరిశీలించింది. అనంతరం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి వెళ్లి అక్కడి సదుపాయాలు, వైద్య సేవలు....... హోం క్వారంటైన్‌కు తరలించిన, డిశ్చార్జి అయిన వారి వివరాలు పరిశీలించింది. ఐసీయూలో ఉన్నవారి ఆరోగ్య పరిస్థితితోపాటు టెస్టుల నిర్వహణలో తీసుకుంటున్న జాగ్రత్తలు అడిగితెలుసుకుంది. తర్వాత ముషీరాబాద్ డివిజన్ పరాన్బస్తీలో పర్యటించిన బృందం..కరోనా కట్టడికి చేపడుతున్న చర్యలపై ఆరాతీసింది. చివరగా దోమల్‌గూడలోని దోభీగల్లీ కంటైన్మెంట్జోన్లలోని 26 ఇళ్లను పరిశీలించారు. మరో నలుగురికి పరీక్షలు జరుపుతున్న తీరును తెలుసుకున్నారు.
అప్రమత్తంగా ఉన్నాం...
క్షేత్రస్థాయి పర్యటన తర్వాత సచివాలయంలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లతో కేంద్ర బృందం సమావేశమైంది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై......... విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో కోవిడ్ కట్టడిపై వైద్యశాఖ అధికారులు..........దృశ్యరూపక ప్రదర్శన ఇచ్చారు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి, కంటైన్మెంట్ చర్యలు, ఆసుపత్రుల సన్నద్దత, వైద్యసంరక్షణ పరికరాల సమీకరణ, వ్యాధి నివారణ చర్యలపై.... కేంద్ర బృందానికి వివరించారు.