కొవిడ్ కష్టకాలంలో భారత్ సమర్ధవంతమైన వ్యాక్సిన్లు తయారుచేస్తోందని నిరూపించిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రపంచంలోనే దేశం గర్వపడేలా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి మానవాళిని కాపాడిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలుగు గడ్డ నుంచి భారత్ బయోటెక్ కొవాగ్జిన్ తయారు చేయడం గర్వకారణమన్నారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, మన్సుఖ్ మాండవీయ కలిసి భారత్ బయోటిక్, బయోలాజికల్-ఈ, రెడ్డి ల్యాబ్స్ కి చెందిన కొవిడ్ వాక్సిన్ ఉత్పత్తి ప్లాంట్లను పరిశీలించి.. వ్యాక్సిన్ ఉత్పత్తిని సమీక్షించారు. ఇప్పుడు 130 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలనే సవాల్‌ను మనం స్వీకరించి ఉత్పత్తిని పెంచి అందరిని కాపాడాలన్నారు. ఇది ఒక యజ్ఞం లాగా జరగాలని... అందుకు అందరి సహకారం కావాలన్నారు. హైదరాబాద్‌లో మరింత వేగంగా వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలని మోదీ ప్రభుత్వం తన వంతు కృషి చేస్తోందని కిషన్‌రెడ్డి వివరించారు.
KISHAN REDDY: 'భారత్ బయోటెక్ కొవాగ్జిన్‌ను తయారు చేయడం రాష్ట్రానికి గర్వకారణం' - telangana varthalu
కరోనా విపత్కర సమయంలో భారత్ సమర్ధవంతమైన వ్యాక్సిన్లు తయారుచేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తెలుగు గడ్డ నుంచి భారత్ బయోటెక్ కొవాగ్జిన్ తయారు చేయడం గర్వకారణమన్నారు. మరో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయతో కలిసి... భారత్ బయోటెక్, బయోలాజికల్-ఈ, రెడ్డీస్ ల్యాబ్స్‌కి చెందిన కొవిడ్ వాక్సిన్ ఉత్పత్తి ప్లాంట్లను పరిశీలించారు.
KISHAN REDDY: 'భారత్ సమర్ధవంతమైన వ్యాక్సిన్లు తయారు చేసింది'
వాక్సిన్ ఉత్పత్తి మరింత వేగవంతంగా జరగాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. అందరికి త్వరితగతిన వ్యాక్సిన్ అనే ప్రధాని మోదీ ఆశయాన్ని నిలబెట్టాలని ఆయన చెప్పారు. వ్యాక్సిన్ అందరికి అందినప్పుడే కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనగలమన్నారు.
ఇదీ చదవండి: Dalit Empowerment: బ్యాంక్ గ్యారంటీ లేకుండానే ఎస్సీలకు రుణాలు, ఆర్థికసాయం: సీఎం