తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్లాస్టిక్ నిర్మూలనకు దేశవ్యాప్త ప్రచారం: కేంద్రమంత్రి సదానందగౌడ

హైదరాబాద్ చర్లపల్లి పారిశ్రామికవాడలోని సీపెట్​లో బాలుర వసతిగృహాన్ని కేంద్రమంత్రి సదానందగౌడ ప్రారంభించారు. మానవ జీవితంలో ప్లాస్టిక్​ వాడకం ఎక్కువైందని, రీసైక్లింగ్ ప్లాస్టిక్​ను వాడేలా ప్రచారం చేస్తామన్నారు.

అక్టోబరు 2న రీసైక్లిల్ ప్లాస్టిక్ మాత్రమే వాడాలి:

By

Published : Sep 26, 2019, 7:11 PM IST

అక్టోబరు 2న రీసైక్లిల్ ప్లాస్టిక్ మాత్రమే వాడాలి:

అక్టోబర్ 2న రీసైకిల్​ ప్లాస్టిక్ మాత్రమే వాడేలా దేశవ్యాప్తంగా ప్రచారం చేయనున్నట్లు కేంద్రమంత్రి సదానంద గౌడ అన్నారు. హైదరాబాద్ చర్లపల్లి పారిశ్రామికవాడలోని సీపెట్​లో నిర్మించిన బాలుర హాస్టల్​ను ఆయన ప్రారంభించారు. 415 మంది విద్యార్థులకు సరిపోయేలా భవనాన్ని నిర్మించినట్లు, దేశంలో 25 హాస్టళ్లు ఉన్నట్లు తెలిపారు. పాలిమర్ టెక్నాలజీ కోర్సులో చేరే గ్రామీణ ప్రాంతాల పేద విద్యార్థులకు కేంద్రప్రభుత్వం ఆర్థికసాయం చేస్తుందన్నారు. ప్లాస్టిక్ మానవ జీవితంలో ఓ భాగమైందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ రేవంత్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మెహన్, ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details