తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యాక్సినేషన్​లో రైల్వే ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలి: కిషన్​ రెడ్డి - కొవిడ్ ఫ్రంట్​లైన్ వారియర్లుగా గుర్తించాలంటూ సీఎంకు లేఖ

రైల్వే సిబ్బందిని కొవిడ్ ఫ్రంట్​లైన్ వారియర్లుగా గుర్తించాలని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్​కు లేఖ రాశారు. కష్టకాలంలో తమ ప్రాణాలను లెక్కచేయకుండా పని చేస్తున్నారని పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్​లో వారికి ప్రాధాన్యత ఇస్తూ ఆదేశాలు కూడా జారీ చేశాయని తెలిపారు.

central minister kishan reddy writes a letter to cm KCR
సీఎం కేసీఆర్​కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ

By

Published : May 19, 2021, 3:48 PM IST

రైల్వే ఉద్యోగులను ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా గుర్తించి వ్యాక్సినేషన్​లో ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహయ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్​కు సూచించారు. దేశవ్యాప్తంగా కరోనాకు సంబంధించిన అత్యవసర వైద్య పరికరాల సరఫరాలో కీలకపాత్ర పోషిస్తున్నారని సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఆక్సిజన్‌కు సంబంధించి ప్రత్యేక రైళ్లను నడపడం, దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజల కోసం ప్రత్యేకంగా శ్రామిక రైళ్ల విషయంలో తమ ప్రాణాలను లెక్క చేయకుండా పనిచేస్తున్నారని లేఖలో వివరించారు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా రైల్వే ఉద్యోగులు కూడా కొవిడ్ బారిన పడే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇప్పటికే ఒడిశా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రైల్వే ఉద్యోగులను ఫ్రంట్ లైన్ సిబ్బందిగా గుర్తించి వ్యాక్సినేషన్​ ప్రాధాన్యత కల్పిస్తూ ఆదేశాలు కూడా జారీ చేశాయని తెలిపారు. వారి సేవలను గుర్తించి రాష్ట్రంలో పనిచేస్తున్న రైల్వే ఉద్యోగులకు వ్యాక్సినేషన్​తో పాటు వైద్య సదుపాయాలు కల్పించేలా తక్షణమే నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రికి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

సీఎం కేసీఆర్​కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ

ఇదీ చూడండి:తడిసినా సరే ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం.. ధైర్యంగా ఉండండి: గంగుల

ABOUT THE AUTHOR

...view details