తెలంగాణ

telangana

Kishanreddy: వ్యాక్సిన్ కేంద్రాన్ని పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

మెహదీపట్నంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కోరనా వాక్సిన్ కేంద్రాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. టీకాలు తీసుకునేందుకు వచ్చిన వారంతా మాస్కు ధరించి, భౌతిక దూరం పాచించాలని సూచించారు.

By

Published : Jun 1, 2021, 3:29 PM IST

Published : Jun 1, 2021, 3:29 PM IST

central minister kishan reddy visited mehadipatnam vaccine center
వ్యాక్సిన్ కేంద్రాన్ని పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్ మెహదీపట్నంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కారోనా వాక్సిన్ కేంద్రాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పర్యవేక్షించారు. వైద్యులు, టీకాలు తీసుకుంటున్న ప్రజలతో కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో గుడి మల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఫంక్షన్ హాల్లో టీకాల పంపిణీ గత రోజులుగా కొనసాగుతున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ప్రతి రోజు సుమారు వెయ్యి మందికి వాక్సిన్ ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. అత్యవసమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదని తెలిపారు. ఒకవేళ వచ్చినా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు.

ఇదీ చదవండి :Diagnostics: కరోనా నిర్ధారణ పరీక్షకు వెళ్తే నిలువు దోపిడీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details