తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెలంగాణ పవర్​ప్లాంట్ రెండో దశకు శంకుస్థాపన అప్పుడే జరగాలి'

రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆ సమయానికి.. తెలంగాణ పవర్​ ప్లాంట్​ రెండో దశ నిర్మాణానికి శంకుస్థాపన జరిగేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.

central-minister-kishan-reddy
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

By

Published : Jan 22, 2021, 5:13 PM IST

రామగుండం విద్యుత్ ప్లాంట్​పై ఎన్టీపీసీ అధికారులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఏర్పాటు చేయాలనుకున్న పవర్ ప్లాంట్ నిర్మాణ స్థితిపై అధికారులను ఆరా తీశారు. ప్రస్తుతం 800 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్ల నిర్మాణం జరుగుతోందని.. కొవిడ్ వల్ల పనులు ఆలస్యమయ్యాయని అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు.

రెండో దశలో 800 మెగావాట్ల సామర్థ్యం గల 3 యూనిట్ల కోసం కావాల్సిన అనుమతుల ప్రక్రియ గురించి అధికారులను కేంద్ర మంత్రి అడిగారు. ప్రస్తుతం ఉన్న యూనిట్లతో పాటు త్వరలో నిర్మించబోయే యూనిట్లకు కూడా దగ్గర్లో ఉన్న సింగరేణి బొగ్గు మాత్రమే వినియోగించుకునేలా అధికారులు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. కోల్ లింకేజ్​లపై ఇప్పటి వరకు జరిగిన ఒప్పందాల వివరాలు తెలుసుకున్నారు.

త్వరలోనే రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. ఆ సమయానికి.. తెలంగాణ పవర్​ ప్లాంట్​ రెండో దశ నిర్మాణానికి శంకుస్థాపన జరిగేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. దేశంలోనే అతిపెద్ద నీటిపై అమర్చే సోలార్‌ పవర్ ప్లాంటును 100 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్నట్లు ఎన్టీపీసీ అధికారులు కేంద్ర మంత్రికి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details