బేగంపేటలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(central minister kishan reddy) హాజరయ్యారు. ఈ భేటీలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, దిశ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. హైదరాబాద్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై చర్చించారు. దిశ కమిటీ భేటీకి హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ రాలేదు. వారి గైర్హాజరుపై కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్, కమిషనర్ లేకుండా సమావేశం ఎందుకు పెట్టారని ఆయన మండిపడ్డారు.
అందరికీ టీకా అందేలా అధికారులు కృషి చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(central minister kishan reddy) సూచించారు. రాష్ట్రాల వద్ద 20 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. బస్తీల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని పేర్కొన్నారు. భారత్ టీకాల కోసం ఇతర దేశాలు ఎదురు చూస్తున్నాయని మంత్రి వెల్లడించారు. బస్తీ దవాఖానాలను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వీధి వ్యాపారులకు త్వరగా గుర్తింపు కార్డులు ఇవ్వాలని మంత్రి సూచించారు.