ఆంధ్రప్రదేశ్ విశాఖలోని ఆర్.ఆర్. వెంకటాపురం గ్యాస్‌లీక్ ఘటనపై కేంద్ర హోంశాఖ ఆరా తీస్తోంది. గ్యాస్‌లీక్ ఘటనపై అధికారులు వివరాలు తెలుసుకుంటున్నారు.
మృతులకు కిషన్‌రెడ్డి సంతాపం
ఆంధ్రప్రదేశ్ విశాఖలోని ఆర్.ఆర్. వెంకటాపురం గ్యాస్‌లీక్ ఘటనపై కేంద్ర హోంశాఖ ఆరా తీస్తోంది. గ్యాస్‌లీక్ ఘటనపై అధికారులు వివరాలు తెలుసుకుంటున్నారు.
మృతులకు కిషన్‌రెడ్డి సంతాపం
విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో మరణించిన కుటుంబాలకు కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సంతాపం తెలియజేశారు. ఎప్పటికప్పడు అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నాం అన్నారు. ఈ ఘటనలో వందలాది ప్రజలు అపస్మారక స్థితిలో ఉన్నారన్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శితో మాట్లాడి ఘటన జరిగిన ప్రాంతంలో అన్ని విధాలుగా సహాయం అందించాలని సూచించినట్లు కిషన్‌రెడ్డి విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో మాట్లాడి సహాయక చర్యలు అందించాలని ఆదేశించినట్లు చెప్పారు. అత్యవసరమైన సహాయ చర్యలు అందించాలని ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలకు సూచించడం వల్ల వారంతా క్షేత్రస్థాయిలో సహాయ చర్యల్లో పాల్గొంటున్నారని తెలిపారు. నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నానని... అవసరమైన చర్యలు తీసుకోవడం కోసం కేంద్ర, రాష్ట్ర అధికారులతో సమన్వయం కొనసాగుతుందని కిషన్‌రెడ్డి వివరించారు.
ఇవీ చదవండి...విశాఖ రసాయన పరిశ్రమలో భారీ ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
TAGGED:
Visakha gas leak trajedy