KISHAN REDDY COMMENTS ON KCR: సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంతో లిఖిత పూర్వక ఒప్పందం మేరకే కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తుందని కేంద్రమంత్రి తెలిపారు. ఈ విషయాన్ని వదిలిపెట్టి కేసీఆర్ కుటుంబం... కేంద్రంపై అనేక రకాల తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. కుటుంబ పార్టీలు దేశానికి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా తెరాస వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని భాజపా కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
బాయిల్డ్ రైస్ తినేవారు తక్కువ
హుజూరాబాద్ ఎన్నికల సమయంలో ప్రగతిభవన్ పూర్తిగా తెరాస కార్యాలయంగా మారిపోయిందని మండిపడ్డారు. ఎంత అణిచివేస్తే అంతా తిరగబడుతామని అక్కడి ప్రజలు నిరూపించారని కేంద్రమంత్రి తెలిపారు. హుజూరాబాద్ తీర్పును మళ్లించడం కోసం వరిధాన్యం కొనుగోలుపై తెరాస కొత్త పల్లవి ఎత్తుకుందని ఎద్దేవా చేశారు. లేని సమస్యలను సృష్టించి ధర్నాచౌక్ వద్ద కేసీఆర్ ధర్నా చేపట్టారని విమర్శించారు. పంట బీమాపథకం తెలంగాణలో అమలు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్నారని దుయ్యబట్టారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు తెరవడంలేదని ప్రశ్నించారు. దేశంలో బాయిల్డ్ రైస్ తినే ప్రజల సంఖ్య తగ్గిపోయిందని ఆయన పేర్కొన్నారు. 2014లో ధాన్యం సేకరణ కోసం కేంద్రం రూ.3,600 కోట్లు ఖర్చు చేస్తే.. ప్రస్తుతం ధాన్యం సేకరణ కోసం కేంద్రం 26,600 కోట్లు ఖర్చు చేస్తోందని మంత్రి వివరించారు.
శనిగలు ఎక్కడికి పోయాయి..