kishan reddy on cm kcr bihar visit: తెలంగాణ సంపదను బిహార్‌కు దోచిపెడుతున్నారన్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ పావలా పన్ను కట్టి రూపాయి దోచుకుంటున్నారని మండిపడ్డారు. గతంలో బిహార్ గురించి కేసీఆర్ విమర్శలు చేశారని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ తెలంగాణను వదిలేసి ఇతర రాష్ట్రాల్లో ఎందుకు పర్యటిస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలాగే కేసీఆర్ నియంతృత్వ పాలన దేశమంతా అమలు చేస్తారా? అని నిలదీశారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ మోడల్ అంటే కల్వకుంట్ల మోడలా?. ప్రజలకు అందుబాటులో లేని పాలన చేయాలనుకుంటున్నారా? సమస్యలు చెప్పుకునేందుకు సీఎం అందుబాటులో ఉండరు. నెలలో 15 రోజులు ఫాంహౌస్‌లో ఉండడమే తెలంగాణ మోడలా?. 15 శాఖలు కల్వకుంట్ల కుటుంబం చేతిలో పెట్టుకుని పాలిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో కేసీఆర్ పర్యటిస్తూ కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ ప్రచారం చేసినా ఏ ఒక్క రాష్ట్రం పట్టించుకోవట్లేదు. కేసీఆర్ వ్యవహారం చూసి నాయకులు నవ్వుకుంటున్నారు. నిన్నటి భేటీలో ఇద్దరు నాయకులు కలిసి కూర్చోలేని పరిస్థితి. నితీశ్ లేచి వెళ్తుంటే కూర్చోమని కేసీఆర్ ప్రాధేయపడ్డారు. నాయకులందరినీ కేసీఆర్ ఏవిధంగా ఏకం చేస్తారో తెలియట్లేదు.- కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి
భాజపాను విమర్శించే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. భాజపా అధికారంలోకి వచ్చాక మత కలహాలు తగ్గాయని తెలిపారు. తెలంగాణ పూర్తిగా అభివృద్ధి చెందినట్లు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి కల్వకుంట్ల కుటుంబమే దిక్కని గొప్పలు చెబుతున్నారని విమర్శించారు. తెలంగాణ నమూనా దేశానికి ఆదర్శమని చెబుతున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. పలు రాష్ట్రాల్లో కేసీఆర్ పర్యటిస్తూ కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ ప్రచారం చేసినా ఏ ఒక్క రాష్ట్రం పట్టించుకోవట్లేదన్నారు. కేసీఆర్ వ్యవహారం చూసి నాయకులు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నిన్నటి భేటీలో ఇద్దరు నాయకులు కలిసి కూర్చోలేని పరిస్థితి స్పష్టంగా కనిపించిందని కిషన్‌రెడ్డి తెలిపారు. నితీశ్ లేచి వెళ్తుంటే కూర్చోమని కేసీఆర్ ప్రాధేయపడ్డారని వ్యంగ్యంగా మాట్లాడారు. దేశవ్యాప్తంగా నాయకులందరినీ కేసీఆర్ ఏవిధంగా ఏకం చేస్తారో అంతు చిక్కడం లేదన్నారు.