పార్లమెంట్లో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ప్రాధాన్యతను మరింత పెంచడానికి ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. అన్ని రంగాలకు ఆమోదయోగ్యంగా ఉండే విధంగా పద్దు రూపొందించారని తెలిపారు.
'అన్ని రంగాలకు మేలు చేసే బడ్జెట్ ఇది' - కేంద్ర బడ్జెట్
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన పద్దు అన్నిరంగాల ప్రజలకు మేలు చేసే విధంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీ బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. ఏ రంగాన్నీ విస్మరించకుండా ఆచరణకు సాధ్యమయ్యే హామీలే బడ్జెట్లో పొందుపరిచారని తెలిపారు.
'దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే బడ్జెట్ ఇది'
మిషన్ భగీరథ, కాళేశ్వరం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రాజెక్టులని, కేంద్రం... రాష్ట్రాలకు కేటాయించిన 42 శాతం డెవల్యూషన్ నిధుల నుంచే ఆ ప్రాజెక్టులకు నిధులు పంపిణీ చేస్తారని మంత్రి స్పష్టం చేశారు.