తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే పథకాలు చక్కగా అమలవుతాయి : అమిత్‌ షా - బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌లపై అమిత్‌ షా పైర్‌

Central Minister Amit Shah Fires on BRS and Congress : రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే పథకాలు చక్కగా అమలవుతాయని కేంద్రమంత్రి అమిత్‌ షా తెలిపారు. తెలంగాణకు మోదీ గ్యారెంటీ ఇస్తున్నారని అన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన బీజేపీ మేనిఫెస్టో విడుదల చేస్తూ.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలపై విమర్శలు చేశారు.

Central Minister Amit Shah Fires on BRS and Congress
Central Minister Amit Shah Fires on BRS and Congress

By ETV Bharat Telangana Team

Published : Nov 18, 2023, 9:20 PM IST

Central Minister Amit Shah Fires on BRS and Congress : తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో కేంద్రమంత్రి అమిత్‌ షా(Amit Shah) రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రచారం ముగిసిన అనంతరం తెలంగాణకు మోదీ గ్యారెంటీ ఇస్తున్నారు.. రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే పథకాలు చక్కగా అమలవుతాయని కేంద్రమంత్రి అమిత్‌ షా తెలిపారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన బీజేపీ మేనిఫెస్టో(BJP Manifesto) విడుదల చేస్తూ.. తెలంగాణకు కమలం పార్టీ చేసిన అభివృద్ధిని వివరించారు. అనంతరం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలపై విమర్శలు చేశారు.

రాష్ట్ర విభజన జరిగిన ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణకు కేంద్రం ఏకంగా రూ.2.15 లక్షల కోట్లను ఇచ్చిందని కేంద్రమంత్రి అమిత్‌ షా అన్నారు. తెలంగాణకు పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీని మోదీ ఇప్పటికే ప్రకటించారని గుర్తు చేశారు. అలాగే 2019లో బీబీనగర్‌లో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. తెలుగు రాష్ట్రాలకు 3 వందే భారత్‌ రైళ్లు(Vande Bharat Trainsను కేటాయించామని అమిత్‌ షా స్పష్టం చేశారు. కరోనా సమయంలో దేశమంతా ఉచితంగా రేషన్‌ ఇచ్చామన్నారు.

బీజేపీకి మీరు వేసే ఓటు - తెలంగాణ, దేశ భవిష్యత్తును మారుస్తుంది : అమిత్​ షా

Amit Shah Election Campaign in Telangana :గతంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసుకున్నామని అమిత్‌ షా పేర్కొన్నారు. అప్పుడు ఏర్పాటు చేసిన ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల విభజనలో ఎలాంటి వివాదాలు తలెత్తలేదని స్పష్టం చేశారు. కానీ తెలంగాణ ఏర్పాటులో మాత్రం కాంగ్రెస్‌ సరిగా వ్యవహరించలేదని మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ఆవేదన చెందారు. కాళేశ్వరం(Kaleshwaram Project) రూపంలో నిధులన్నీ కేసీఆర్‌కు చేరుతున్నాయని ఆరోపించారు. అందుకే 2014లో మిగులు నిధులతో ఏర్పడిన తెలంగాణ.. నేడు రూ.6 లక్షల కోట్ల అప్పులతో ఉందని విమర్శించారు.

BJP Telangana Election Manifesto Release : అనంతరం మన మోదీ గ్యారెంటీ.. బీజేపీ భరోసా పేరుతో బీజేపీ మేనిఫెస్టోను అమిత్‌ షా విడుదల చేశారు. ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడానికే.. బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టోనని అన్నారు. ముఖ్యంగా ధరణి(Dharani) పేరుతో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల భూములను గుంజుకుంటుందని.. అందుకే ధరణిని రద్దు చేసి మీ భూమి యాప్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించారు. అలాగే తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ అమలుకు ప్రత్యేక నోడల్‌ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉద్యోగస్తులకు, పింఛన్‌ దారులకు ప్రతినెల 1వ తేదీన వేతనాలు, పింఛన్లు వేస్తామన్నారు.

Amit Shah Khammam Meeting : ఖమ్మంలో 'రైతు గోస- బీజేపీ భరోసా' సభతో.. రాష్ట్రంలో వేడేక్కిన రాజకీయం

బీజేపీ అధికారంలోకి వస్తే, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం : అమిత్ షా

ABOUT THE AUTHOR

...view details