రాష్ట్రంలో మరో 8 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం సేకరణకు కేంద్రం అనుమతి - FCI Latest News
12:31 August 11
రాష్ట్రంలో మరో 8 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం సేకరణకు కేంద్రం అనుమతి
రాష్ట్రంలో మరో 8 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం సేకరణకు కేంద్రం అనుమతి తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాలశాఖకు సమాచారం పంపిది. 2021-22 యాసంగిలో పండించిన 8 లక్షల టన్నుల బియ్యం సేకరణకు ఆమోదం తెలిపింది. బియ్యాన్ని గతంలోని 6.05 లక్షల టన్నులకు అదనంగా సేకరించాలని నిర్ణయించింది. ఉప్పుడు బియ్యం సేకరణపై ఎఫ్‌సీఐ చర్యలు తీసుకుంటుందని పేర్కొంది. ఉప్పుడు బియ్యం సేకరణపై కేంద్రం నిర్ణయాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్వాగతించారు. ప్రధానితో పాటు పీయూష్‌గోయల్‌కు కిషన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
ఇవీ చదవండి:Bank Frauds Arrested: యూట్యూబ్‌లో చూశారు.. బ్యాంకును ముంచారు.. చివరకు..!
భారీ స్కామ్.. రూ.58కోట్ల క్యాష్, 32కేజీల గోల్డ్ స్వాధీనం.. లెక్కించేందుకు 13 గంటలు!