తెలంగాణ

telangana

ETV Bharat / state

'మోదీ ప్రభుత్వానికి ఓటుతో గుణపాఠం చెబుదాం' - GHMC Elections 2020

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తెరాసకే తమ మద్దతు అని కేంద్ర, ప్రభుత్వ రంగ సంస్థ సమైక్య తెలిపింది. మోదీ ప్రభుత్వానికి ఓటు అనే ఆయుధంతో గుణపాఠం చెప్పాలని పేర్కొంది.

modi
'మోదీకి ఓటు అనే ఆయుధంతో గుణపాటం చెబుదాం'

By

Published : Nov 27, 2020, 7:35 PM IST

కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న మోదీ ప్రభుత్వానికి ఓటు అనే ఆయుధంతో తగిన గుణపాఠం చెప్పాలని కేంద్ర, ప్రభుత్వ రంగ సంస్థ సమైక్య వ్యాఖ్యానించింది. కేంద్రంలో భాజపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాల సంగతి ఏమో కానీ... ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్‌ పరం చేసేందుకు ప్రయత్నం చేస్తున్న భాజపాను రాబోయే గ్రేటర్‌ ఎన్నికల్లో ఓడించాలని హైదరాబాద్‌ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో పిలుపునిచ్చారు. నరేంద్రమోదీ కార్మిక చట్టాలను కాలరాస్తున్నారని.. లాభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను కార్పొరేటర్‌ సంస్థలకు అప్పగించేందుకు ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర, ప్రభుత్వ రంగ సంస్థ సమైక్య అధ్యక్షుడు ధనకర్ణాచారి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను కాపాడుకోవాలంటే గ్రేటర్‌ ఎన్నికల్లో తెరాస పార్టీకి ఓటు వేసి.. కేసీఆర్‌కు మరింత బలం అందించాలని బీఎస్‌ఎన్‌ఎల్‌ రాష్ట్ర కార్యదర్శి సంపత్‌రామ్‌ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details