ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎదుట తెలంగాణ కార్మిక సంఘాలు ధర్నా చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రైవేటీకరణ ద్వారా.. సామాన్యులకు అందుబాటులో ఉన్న రైల్వే ప్రయాణాన్ని.. దూరం చేయవద్దని నేతలు విజ్ఞప్తి చేశారు. కేంద్రం.. పునరాలోచించి ప్రైవేటీకరణ విధానాలను ఉపసంహరించుకోవాలని కోరారు.
'ప్రైవేటీకరణతో.. ప్రజా వ్యతిరేక పాలనకు పాల్పడుతున్నారు' - సికింద్రాబాద్ రైల్వేస్టేషన్
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎదుట తెలంగాణ కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. కేంద్రం.. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ... ప్రజావ్యతిరేక పాలనకు పాల్పడుతోందని నేతలు విమర్శించారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
'ప్రైవేటీకరణతో.. ప్రజా వ్యతిరేక పాలనకు పాల్పడుతున్నారు'
ఎన్నో పోరాటాలు, బలిదానాల ద్వారా నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను.. మోదీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయడం దారుణమంటూ కార్మిక సంఘం నేత బోసు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాల నుంచి.. వెనక్కు తగ్గకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:కేంద్రం దిగిరాకపోతే నిరవధిక సమ్మెకు సిద్ధం: బ్యాంకు ఉద్యోగ సంఘాలు