తెలంగాణ

telangana

ETV Bharat / state

దిల్లీలో తెరాస కార్యాలయానికి స్థల అప్పగింత ప్రక్రియ పూర్తి

దేశ రాజధానిలో తెరాస పార్టీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన 1,100 చదరపు మీటర్ల స్థల అప్పగింత ప్రక్రియ పూర్తయ్యింది. దిల్లీ వసంత్‌ విహార్‌లో తెరాసకు స్థలం కేటాయిస్తూ.. ఈ ఏడాది అక్టోబర్‌ 9న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. స్థలానికి రూ.25.79 కోట్లు చెల్లించాలని.. దీనితో పాటు ఏడాదికి 2.5 శాతం అద్దె చెల్లించే ప్రాతిపదికన స్థలాన్ని కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

central government land hand over to trs party for office in delhi
దిల్లీలోనూ తెరాస కార్యాలయం... భూమిని పార్టీకి అప్పగించిన కేంద్రం

By

Published : Nov 4, 2020, 3:01 PM IST

Updated : Nov 4, 2020, 11:03 PM IST

దిల్లీలో తెరాస పార్టీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన 1,100 చదరపు మీటర్ల స్థల అప్పగింత ప్రక్రియ పూర్తయ్యింది. ఈ మేరకు స్థలానికి సంబంధించిన పత్రాలను తెరాస నేత, రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డికి కేంద్ర పట్టణాభివృద్ది శాఖ అధికారులు అందజేశారు.

దిల్లీ వసంత్‌ విహార్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి స్థలం కేటాయిస్తూ.. ఈ ఏడాది అక్టోబర్‌ 9న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. స్థలానికి రూ.25.79 కోట్లు చెల్లించాలని.. దీనితో పాటు ఏడాదికి 2.5 శాతం అద్దె చెల్లించే ప్రాతిపదికన స్థలాన్ని కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు వెంటనే స్పందించిన తెరాస.. అందుకు సంబంధించిన లాంఛనాలు పూర్తిచేసింది. దేశ రాజధానిలో ప్రాంతీయ పార్టీలు సహా అన్ని పార్టీలకు కేంద్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించే ప్రక్రియలో భాగంగా తెరాసకు కూడా కేటాయించారు. జాతీయ పార్టీలన్నీ ఇప్పటికే సొంత నిర్మాణాలతో కార్యాలయాలు నిర్మించుకోగా.. ప్రాంతీయ పార్టీల్లో అన్నా డీఎంకే సాకేత్‌లో సొంతగా పార్టీ కార్యాలయం నిర్మించుకుంది.

మిగిలిన పార్టీలకు స్థల కేటాయింపులు జరిపినా.. నిర్మాణం చేపట్టలేదు. కేటాయించిన స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మాణం చేపడితే.. దిల్లీలో పూర్తి స్థాయి పార్టీ కార్యాలయం నిర్మించుకున్న రెండో పార్టీగా తెరాస నిలిచిపోనుంది.

ఇవీ చూడండి: దుబ్బాక గెలుపుపై పార్టీల ధీమా... మెజార్టీ లెక్కల్లో నేతలు

Last Updated : Nov 4, 2020, 11:03 PM IST

ABOUT THE AUTHOR

...view details