ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన ఖాతాదారులకు కేంద్రం శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో జన్‌ధన్ ఖాతాలలో రూ.770.26 కోట్లను కేంద్రం జమ చేసింది. జనం ఇళ్లకే పరిమితమైన వేళ ఆర్థికంగా పేదలను ఆదుకునేందుకు జనధన్ ఖాతాదారులకు మూడు నెలలపాటు ప్రతి నెల రూ.500 ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కొవిడ్ కారణంగా అన్ని వ్యవస్థలు స్తంభించిపోగా... మూడునెలలుగా ఇవ్వాల్సిన నగదును కేంద్రం ఇవ్వలేదు.
జన్‌ధన్ ఖాతాదారులలో నగదు జమ
జన్‌ధన్ ఖాతాదారులకు కేంద్రం 770 కోట్ల రూపాయలను విడుదల చేసింది. కొవిడ్ కారణంగా అన్ని వ్యవస్థలు ఆగిపోగా.. కేంద్రం మూడునెలలకు అందించాల్సిన నగదును ఇప్పుడు ఖతాల్లో జమ చేసింది.
జన్‌ధన్ ఖాతాదారులలో నగదు జమ
ఏప్రిల్, మే, జూన్ నెలలకు రావల్సిన మొత్తం నగదును 50.83లక్షల జనధన్ ఖాతాలకు నగదును జమ చేసినట్లు బ్యాంకర్లు తెలిపారు. ఏప్రిల్‌లో రూ.261.83 కోట్లు, మే నెలలో రూ.254.26 కోట్లు, జూన్‌లో రూ.254.17 కోట్లుగా మొత్తం కలిపి రూ.770.26 కోట్లు మేర ఆయా ఖాతాదారుల ఖాతాల్లో జమ అయ్యింది
Last Updated : Nov 3, 2020, 9:57 PM IST