కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఉన్నతాధికారులతో దృశ్యమాధ్యమ ద్వారా సమీక్షించారు. తెలంగాణ సరిహద్దు రాష్ట్రం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలపై దృష్టి సారించాలని ఆదేశించింది. సమీక్షలో రాష్ట్రం ఎన్నికల సంఘం సీఈవో రజత్ కుమార్, సీఎస్ జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది, అధికారులు పాల్గొన్నారు.
ఇప్పటికే సమావేశం
మహారాష్ట్రలోని గడ్చిరోలి, నాందేడ్, చంద్రాపూర్, యావత్ మాల్ జిల్లాలతో రాష్ట్రానికి సరిహద్దు ఉందని... సరిహద్దు జిల్లాలలో 14 చెక్ పోస్టులు ఉన్నాయని సీఎస్ జోషి తెలిపారు. మహారాష్ట్ర అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేస్తామని చెప్పారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటలు ముందు, లెక్కింపు రోజున ఉదయం ఆరు గంటల నుంచి సరిహద్దు ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూసివేతకు చర్యలు తీసుకుంటామని జోషి చెప్పారు.మహారాష్ట్ర పోలీస్ అధికారులతో సమన్వయంతో పనిచేస్తున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆ రాష్ట్ర పోలీసులు ఇప్పటికే సమావేశాలు నిర్వహించామని చెప్పారు.
శాంతిభద్రతలపై దృష్టి సారించండి: సీఈసీ ఇదీ చూడండి: ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష