Central Election Commission Team to Visit Telangana : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కసరత్తు వేగవంతంగా ముందుకు సాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం చేయాల్సిన పనులను తొందరగా నిర్వహించేందుకు తగిన ప్రణాళికలను రూపొందిస్తోంది. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల సన్నాహకాలను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం వచ్చే నెల మూడో తేదీ నుంచి రాష్ట్రంలో పర్యటించనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్(Vikas Raj) తెలిపారు. మూడు రోజుల పాటు హైదరాబాద్లో పర్యటించనున్న ఈసీ బృందం.. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను సమీక్షించడంతో పాటు రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. అక్టోబర్ మూడో తేదీన జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశమై ఎన్నికల నిర్వహణాపరమైన అంశాలపై చర్చించనుంది.
Central Election Team Visit in Hyderabad: ఎక్సైజ్, ఆదాయపన్ను, జీఎస్టీ, రవాణా, తదితర నిఘా విభాగాల అధికారులు, బ్యాంకర్లతో సమావేశం కానుంది. ఈ చర్చలో డబ్బు, మద్యం, ఉచిత కానుకల ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, కేంద్ర, రాష్ట్ర పోలీస్ బలగాల నోడల్ అధికారులతో సమావేశమై భద్రతా పరమైన ప్రణాళిక, ఏర్పాట్లపై సమీక్షిస్తారు. రెండో రోజు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఈసీ బృందం సమావేశం కానుంది.
Telangana Assembly Elections Schedule 2023 : అక్టోబరులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్
Telangana Assembly Elections 2023: జిల్లాల వారీగా ఎన్నికల ప్రణాళిక, ఏర్పాట్లను సమీక్షించనుంది. మూడో రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు సీఎస్, డీజీపీ.. తదితర ఉన్నతాధికారులతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. ఓటర్లకు అవగాహనా కార్యక్రమాలపైనా ఈ బృందం దృష్టి సారిస్తుంది. ఓటర్ల జాబితా(List of Voters), పౌరుల భాగస్వామ్యానికి సంబంధించి ప్రచారం నిర్వహిస్తున్న ప్రముఖులు, దివ్యాంగ ఓటర్లు, యువ ఓటర్లతో కేంద్ర ఎన్నికల సంఘం బృందం సమావేశం కానుంది.