మంత్రి జగదీశ్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు - మంత్రి జగదీశ్ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు
22:27 October 28
20:25 October 28
మంత్రి జగదీశ్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు
EC Notices to Minister Jagadish Reddy: మంత్రి జగదీశ్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. మునుగోడు ఉపఎన్నికలో తెరాస అభ్యర్థికి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు అపుతామంటూ మంత్రి ప్రసంగించారన్న భాజపా ఫిర్యాదు ఆధారంగా ఈసీ తాఖీదు ఇచ్చింది. ఈ నెల 25వ తేదీన ప్రచారంలో భాగంగా జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భాజపా నేత కపిలవాయి దిలీప్ కుమార్ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నుంచి నివేదిక తెప్పించుకొంది. నల్గొండ జిల్లా ఎన్నికల అధికారి, సీఈఓ ఇచ్చిన నివేదికలను పరిశీలించిన ఈసీ.. మంత్రి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా అభిప్రాయపడింది. దీంతో రేపు మధ్యాహ్నం మూడు గంటల్లోపు వివరణ ఇవ్వాలని జగదీశ్ రెడ్డికి స్పష్టం చేసింది. వివరణ అందకపోతే ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తగిన నిర్ణయం తీసుకుంటామని ఈసీ పేర్కొంది.
ఇవీ చదవండి:సీఎం సభకు లక్ష మంది జనం.. అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు: మంత్రి జగదీశ్ రెడ్డి
వివాదాస్పద ఎమ్మెల్యే ఆజం ఖాన్‌పై అనర్హత వేటు.. దోషిగా తేలిన మరుసటి రోజే నిర్ణయం