తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రాజెక్టులపై సమాచారం కోరిన కేంద్రం - పొతిరెడ్డిపాడు ప్రాజెక్టు

రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొత్త ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం అదనపు సమాచారాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గోదావరి, కృష్ణా బోర్డు ఛైర్మన్లతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దృశ్యమాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు.

center-seeking-information-on-new-projects-in-telugu-states
తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రాజెక్టులపై సమాచారం కోరిన కేంద్రం

By

Published : Jun 26, 2020, 12:42 PM IST

రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొత్త ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం అదనపు సమాచారాన్ని కోరినట్లు సమాచారం. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి యు.పి.సింగ్‌ గురువారం కృష్ణా, గోదావరి బోర్డు ఛైర్మన్లతో మరోసారి దృశ్యమాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు అడిగినా ఇంకా ఇవ్వలేదని, ఈ ప్రాజెక్టుల విషయంలో ముందుకెళ్లొద్దని సూచించినా ఎలాంటి సమాధానం లేదని రెండు రోజుల క్రితం అధికారులు జల్‌శక్తి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

తాజాగా ఈ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఉన్నాయా లేదా అని కేంద్ర కార్యదర్శి.. ఆయా బోర్డుల ఛైర్మన్లను అడిగినట్లు తెలిసింది. ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన అనుమతుల్లో ఏమి వచ్చాయి, ఇంకా రావాల్సినవి ఎన్ని ఉన్నాయి తదితర వివరాలను పంపాలని సూచించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.

ఇదీచూడండి: పట్టణ సహకార బ్యాంకులకు పూర్వ వైభవం!

ABOUT THE AUTHOR

...view details