తెలంగాణ

telangana

ETV Bharat / state

సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖులు - nv ramana hyderabad tour news

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి హైదరాబాద్‌ వచ్చిన జస్టిస్‌ ఎన్వీ రమణను పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందించి.. శుభాకాంక్షలు తెలిపారు.

సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖులు
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖులు

By

Published : Jun 14, 2021, 5:09 AM IST

Updated : Jun 14, 2021, 5:46 AM IST

నగరంలో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణతో ఆదివారం పలువురు ప్రముఖులు భేటీ అయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా అత్యున్నత పదవిని అలంకరించిన జస్టిస్‌ రమణకు అభినందనలు తెలిపి సత్కరించారు. తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, రాష్ట్ర మానవహక్కుల సంఘం ఛైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్య, లోకాయుక్త జస్టిస్‌ సీవీ రాములు, కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి, వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు జస్టిస్‌ ఎంఎస్‌కే జైస్వాల్‌, మాజీ న్యాయమూర్తులు జస్టిస్‌ విలాస్‌ అఫ్జల్‌పుర్కర్‌, జస్టిస్‌ యతిరాజులు, జస్టిస్‌ భవానీప్రసాద్‌, జస్టిస్‌ సీతారామమూర్తి, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి శాంతికుమారి, తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనర్లు అంజనీకుమార్‌, సజ్జనార్‌, మహేశ్‌ భగవత్‌లు సీజేఐని కలిసి అభినందనలు తెలిపారు. జస్టిస్‌ రమణను సంజీవరెడ్డినగర్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి తలసాని.. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దర్శనానికి రావాలని ఆహ్వానించారు. రెండు, మూడు రోజుల్లో వస్తానని సీజేఐ హామీ ఇచ్చారు.

అఖిలభారత న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సుబ్బయ్య, దక్షిణ జోనల్‌ కార్యదర్శి జగన్నాథం, న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడు సంతోష్‌రెడ్డి, ప్రతినిధులు, తెలంగాణ హైకోర్టు ఉద్యోగుల సంఘం నేతలు, మాజీ ఎంపీ వివేక్‌, తెలంగాణ అర్చక సమాఖ్య కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ తదితరులు జస్టిస్‌ రమణను కలిసి అభినందనలు తెలిపారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన జస్టిస్‌ ఎన్‌వీ రమణ.. రాజ్‌భవన్‌తో పాటు సంజీవరెడ్డినగర్‌లోని ఆయన సొంత నివాసంలోనూ తనను కలవడానికి వస్తున్న ప్రముఖులకు అందుబాటులో ఉంటున్నారు.

* ఏపీ న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్‌ సీజేఐను కలిసి సంఘం తరఫున శుభాకాంక్షలు తెలిపారు.

సుజనా ఇంటికి జస్జిస్‌ రమణ
పితృ వియోగంతో ఉన్న కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ సుజనాచౌదరి ఇంటికి జస్టిస్‌ రమణ ఆదివారం రాత్రి వెళ్లారు. ఆయన్ని పరామర్శించారు.

సీజేఐకి స్వాగతానికి యాదాద్రిలో సన్నాహాలు..

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి ముస్తాబవుతోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ దంపతులు త్వరలో శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్న నేపథ్యంలో ప్రభుత్వ పక్షాన స్వాగత సన్నాహాలు, బసకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆహ్వానం మేరకు ఈ క్షేత్ర సందర్శనకు జస్టిస్‌ ఎన్‌వీ రమణ వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాలాలయాన్ని సంప్రదాయ హంగులతో తీర్చిదిద్దుతున్నారు. ప్రత్యేక ప్రసాదాలు తయారు చేయాలని నిర్ణయించారు. కొండపై కొత్తగా నిర్మించిన అతిథిగృహంలో సీజేఐ బసకు వీలుగా ఫర్నిచర్‌ ఏర్పాటుచేస్తున్నారు. వాహనాల పార్కింగ్‌కు స్థలాన్ని చదును చేస్తున్నారు. పెద్దగుట్టపై ఇప్పటికే ఒక హెలీప్యాడ్‌ ఉండగా.. మరొకటి నిర్మిస్తున్నారు.

ఇదీ చూడండి: RAITHUBANDHU: ఎల్లుండి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు

Last Updated : Jun 14, 2021, 5:46 AM IST

ABOUT THE AUTHOR

...view details