పంజాగుట్టలోని నాగార్జునహిల్స్‌లో కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కార్యాలయంలో సీబీఐ అధికారులు రెండోరోజు సోదాలు నిర్వహించారు. నిన్న ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తనిఖీలు చేశారు. కంప్యూటర్లు, ఫైళ్లు, ల్యాప్‌టాప్‌లు పరిశీలించి వాటిలోని సమాచారం సేకరించారు. బెంగుళూరులోని పలు బ్యాంకుల నుంచి రూ.360 కోట్లకు పైగా రుణాలు తీసుకుని తిరిగి చెల్లించనందుకు బెస్ట్ అండ్ క్రాంప్టన్ సంస్థ ఎండీ శ్రీనివాస్‌రావుతో పాటు నలుగురు డైరెక్టర్లపై సీబీఐ అధికారులు 2017లో కేసులు నమోదు చేశారు. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు సుజనా చౌదరికి చెందిన బినామీ సంస్థలకు మళ్లించినట్టు అధికారులు అభియోగం మోపారు. కేసు విచారణలో భాగంగా సీబీఐ ఇప్పటికే సుజనా చౌదరికి చెందిన కొన్ని ఆస్తులను తాత్కాలిక జప్తు చేసింది.
సుజనాచౌదరి కార్యాలయంలో రెండోరోజు తనిఖీలు
కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కార్యాలయాలపై సీబీఐ అధికారుల సోదాలు రెండో రోజు ముగిశాయి. కార్యాలయంలోని కంప్యూటర్లు, ఇతర పత్రాలు, ల్యాప్‌టాప్‌లు పరిశీలించి వాటిలోని సమాచారం క్రోడీకరించినట్లు సమాచారం.
సుజనాచౌదరి కార్యాలయంలో రెండోరోజు తనిఖీలు
TAGGED:
sujana