తెలంగాణ

telangana

ETV Bharat / state

జగన్ బెయిల్ రద్దు పిటిషన్.. విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు - జగన్ బెయిల్ పిటిషన్​పై రఘురామకృష్ణ న్యూస్

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో తాను వేసిన పిటిషన్​ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించిందని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు.

cbi-court-about-raghuramakrishnaraju-petetion-on-jagan-bail
జగన్ బెయిల్ రద్దుపై పిటిషన్..

By

Published : Apr 27, 2021, 2:29 PM IST

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఎంపీ రఘురామకృష్ణరాజు గతంలో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్​ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించిందని ఆయన తెలిపారు. తాను వేసిన పిటిషన్​ను మెుదట్లో సాంకేతిక కారణాలతో న్యాయస్థానం తిరస్కరించిందని వెల్లడించారు.

ఆ తరువాత సవరణలు చేసిన తిరిగి పిటిషన్​ వేయడంతో తాజాగా న్యాయస్థానం విచారణకు స్వీకరించిందని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి, సీబీఐకి నోటీసులు వెళ్తాయని అన్నారు. ఉన్నత పదవుల్లో ఉన్న వారే న్యాయస్థానాలకు గౌరవం ఇవ్వకపోతే సాధారణ పౌరులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. దీనిని దృష్టిలో ఉంచుకునే తాను ఈ పోరాటం మొదలు పెట్టానని రఘురామ వివరించారు.

జగన్ బెయిల్ రద్దుపై పిటిషన్..

ఇదీ చదవండి:కరోనాను కూడా వదల్లేదు... సైబర్ నేరగాళ్ల కొత్త దందా

ABOUT THE AUTHOR

...view details