తెలంగాణ

telangana

ETV Bharat / state

పిల్లి బాబూ..ఎక్కడున్నావ్..! - తిరుపతి

పిల్లలు కనిపించకపోతే అల్లాడిపోతాం... వారికోసం వెతకని చోటుండదు.. ఏడవని రోజుండదు .. మరి పిల్లి కనిపించకపోతే..! మీకు పిచ్చా..? పిల్లి కనిపించకపోతే ఏమైంది ..పోతే పోనీ అంటాం. కానీ గుజరాత్​లోని సూరత్​కి చెందిన దంపతులు తాము పెంచుకున్న పిల్లి జాడకోసం తిరుపతి మొత్తం గాలించారు.

పిల్లి బాబూ..ఎక్కడున్నావ్..!

By

Published : Jul 6, 2019, 1:18 PM IST

గుజరాత్​లోని సూరత్​కి చెందిన జైయిష్ భాయ్,మీనా దంపతులు పిల్లి కనిపించలేదని వీధులన్నీ వెతుకుతున్నారు.గత నెల 9న తిరుమలేసుని దర్శనం కోసం పిల్లితో కలిసి వచ్చిన వీరు తిరిగి వెళ్లడానికి 13వతారీఖున ట్రైన్ కోసం ఎదురు చూస్తుండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుపోయారు. వీరికి పెళ్లయ్యి 17 సంవత్సరాలు గడిచినా పిల్లలు లేకపోవడంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఎంత వెతికినా దొరక్కపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు.

పోలీసులకు చెప్తే ఏంకేసు పెట్టాలో తెలియక సొంతూరు వెళ్లిపోమ్మన్నారు. దానికి బాబు అని పేరు పెట్టుకుని ఎంతో ప్రేమగా పెంచుకున్నా పిల్లి ,ఒక్కసారిగా కనిపించకపోయేసరికి భాష రాకున్న దిక్కుతోచని స్థితిలో ఫోటో చేతపట్టుకుని కట్టుబట్టలతో తిరుగారు. ఎంత వెతికినా కనిపించకపోవడంతో భాదతో తిరుగు ప్రయాణమయ్యారు.పిల్లి బాబు దొరికుంటే ఎంత బాగుంటుందో కదా ..!

పిల్లి బాబూ..ఎక్కడున్నావ్..!

ఇదీ చూడండి.కర్ణాటకలో అధికార మార్పిడి ఖాయం!

ABOUT THE AUTHOR

...view details