తెలంగాణ

telangana

ETV Bharat / state

నియ‌మావ‌ళి ఉల్లంఘించిన 14 మందిపై కేసులు

జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. మరో వైపు ఎన్నికల ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. శనివారం గ్రేటర్​ ఎన్నికల ప్రచారంలో ప్రవర్తన నియ‌మావ‌ళి ఉల్లంఘించిన 14 మందిపై కేసులు నమోదు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

Cases against 14 people for violating the ghmc elections rules in telangana
నియ‌మావ‌ళి ఉల్లంఘించిన 14 మందిపై కేసులు

By

Published : Nov 28, 2020, 7:50 PM IST

జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి శనివారం ప్రవర్తన నియ‌మావ‌ళి ఉల్లంఘించిన 14 మందిపై కేసులు న‌మోదు చేశారు. అందులో ఒక‌రిపై పిటీ కేసు నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నిక‌ల పర్యావేక్షణ బృందాల‌కు 15 ఫిర్యాదులు అందాయని వెల్లడించింది.

శనివారం మొత్తం 4 లక్షల 32 వేల 230 రూపాయల న‌గ‌దును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ల‌క్షా 78 వేల విలువైన మద్యం, 8 కిలోల గుట్కా స్వాధీనం చేసుకున్నారు. నగ‌ర ‌వ్యాప్తంగా వివిధ పార్టీల‌కు చెందిన 7,814 ప్రచార తెర‌ల్ని జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం తొలిగించింది. ఇప్పటి వరకు మొత్తం కోటి 46 లక్షల రూపాయలు, 13 లక్షల 66 వేల విలువైన లిక్కర్, గుట్కా తదితరాలను అధికారులు స్వాధీనం చేసుకోగా.. మొత్తం 68 మందిపై ఎఫ్ఐఆర్​లు నమోదయ్యాయి.

ఇదీ చూడండి:రైతు బంధు ఏ రాష్ట్రంలోనైనా ఉందా: కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details