Case registered against Azharuddin: హైదరాబాద్‌లో జరగనున్న భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ-20 మ్యాచ్ టికెట్ల విక్రయం అంశంలో హైదరాబాద్ క్రికెట్ సంఘం తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొక్కిసలాటకు హెచ్‌సీఏ నిర్లక్ష్యమే కారణమని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే అజారుద్దీన్‌పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కి ఫిర్యాదు అందింది. టికెట్ల విషయంలో నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే అజారుద్దీన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి... పదవి నుంచి తొలగించాలని బీసీ రాజకీయ ఐకాస నాయకులు హెచ్‌ఆర్సీని ఆశ్రయించారు. క్రీడాభిమానులపై లాఠీఛార్జికి కారకుడైన అజారుద్దీన్‌తో పాటు... హెచ్‌సీఏ నిర్వాకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఐకాస ఛైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ కోరారు.
అజారుద్దీన్‌పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు.. పదవి నుంచి తొలగించాలని డిమాండ్ - అజారుద్దీన్‌పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు
Case registered against Azharuddin: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు నమోదైంది. టికెట్ల విషయంలో నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడ్డారని బీసీ రాజకీయ ఐకాస నాయకులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అజారుద్దీన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
జింఖానా మైదానం వద్ద తొక్కిసలాటకు ప్రధాన కారణం హెచ్‌సీఏతో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. ఉప్పల్‌లో జరగబోయే ఇండియా-ఆస్ట్రేలియా టీ 20 మ్యాచ్‌కు ఏర్పాట్ల విషయంలో హెచ్‌సీఏ పూర్తి వైఫల్యం చెందిందని పేర్కొన్నారు. క్రీడాభిమానుల నుంచి కోట్ల రూపాయలు దండుకొని... టికెట్ల విషయంలో సరైన ఏర్పాట్లు చేయని... హెచ్‌సీఏ ఇతర రాజకీయ నాయకులు క్షతగాత్రులను పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: