మంత్రి గంగుల కమలాకర్‌కు మరో కేసులో ఊరట లభించింది. ఎన్నికల సమయంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను గంగుల దూషించారన్న అభియోగంపై కరీంనగర్లో నమోదైన కేసును ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టివేసింది.
బండి సంజయ్‌ను దూషించిన కేసులో మంత్రి గంగులకు ఊరట - గంగులపై కేసు కొట్టివేత
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను మంత్రి గంగుల కమలాకర్ దూషించారనే కేసులో ఆయనకు ఊరట లభించింది. కరీంనగర్‌లోని ప్రజా ప్రతినిధుల కోర్టు ఈ కేసును కొట్టివేసింది.
గంగుల కమలాకర్
ఎన్నికల నియమావళి కేసులో ఎంపీ నామ నాగేశ్వరరావుకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. నామ అందుబాటులో లేరని పోలీసులు నివేదించడంతో.. వాట్సాప్ ద్వారా సమన్లు పంపించాలని పాల్వంచ పోలీసులను కోర్టు ఆదేశించింది. వేర్వేరు కేసుల్లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే పాషా ఖాద్రి తదితరులు హాజరయ్యారు.
ఇదీ చదవండి:సాగర్ కాల్వకు గండి.. నీట మునిగిన పంట పొలాలు