సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామికవాడలోని ఆర్వీ ఎంటర్‌ప్రైజెస్‌లో ఈనెల 14న చోరీ జరగింది. అర్ధరాత్రి సమయంలో గోడదూకొచ్చిన ఆగంతుకుడు చేతికి దొరికిన చిన్నపాటి వడ్రంగి యంత్రాలను ఎత్తుకెళ్లాడు. పరిశ్రమలో కొంత భాగం వడ్రంగి పనిచేసుకునేందుకు అద్దెకు ఇచ్చారు. 15 రోజుల నుంచి వారు పనిచేయడంలేదు. అప్పటి నుంచి అక్కడ ఎవ్వరూ లేకపోవడాన్ని అదును చూసుకుని దొంగతనానికి పాల్పడాడు. కుక్కలు మొరగడం వల్ల దొంగ పారిపోయి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చోరీ మొత్తం సీసీటీవీలో నమోదైంది.
పటాన్చెరులో వడ్రంగి సామాను ఎత్తుకెళ్లిన దుండగుడు - పటాన్చెరులో వడ్రంగి సామాను ఎత్తుకెళ్లిన దుండగుడు
ఓ టింబర్ పరిశ్రమలోకి అర్ధరాత్రి సమయంలో అక్రమంగా చొరబడిన ఆగంతుకుడు వడ్రంగి సామగ్రి ఎత్తుకుపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పటాన్చెరులో ఆదివారం జరిగిన ఈ చోరీ విషయం ఇవాళ షాపు తీసేందుకు వచ్చిన యజమాని సీసీటీవీలో నమోదైన చిత్రాల ఆధారంగా గుర్తించారు.
వడ్రంగి సామాను ఎత్తుకెళ్లిన దుండగుడు