ఎలా ఉపయోగించాలి....
కార్డులేకుండా నగదు తీసుకోండి - yono
కార్డు లేకుండా ఏటీఎం నుంచి నగదు తీసుకునే వెసులుబాటు హైదరాబాద్ పరిధిలోకి వచ్చింది. ఈ విధానంలో పదివేల రూపాయల వరకు ఏటీఎంల నుంచి ఉపసంహరణ చేసుకునే సౌలభ్యం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. తమ ఖాతాదారులకు అందుబాటులోకి తెచ్చింది.
కార్డు రహిత సేవలు ప్రారంభం
ఆండ్రాయిడ్, ఐఓఎస్‌మొబైళ్లలో 'యోనో ఎస్బీఐ' యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఒక యూజర్ ఐడీ, పాస్‌కోడ్‌తో పాటు మొబైల్ పిన్ నంబర్‌ను సృష్టించుకోవాలి. యోనో క్యాష్ సౌకర్యం కలిగిన ఏటీఎంల వద్దకు వెళ్లి మొబైల్ పిన్ నంబరు కొట్టగానే నగదు ఎంత డ్రా చేయాలి అని అడుగుతుంది. ఎంటర్ చేయగానే రిజిస్ట్రర్డ్ మొబైల్ నంబరుకు వన్‌టైమ్ పాస్ వర్డ్ వస్తుంది. ఓటీపీ నమోదు చేయగానే నగదు బయటకు వస్తుంది.
ఇవీ చూడండి:ఆ రెండు రోజులు సంక్షిప్త సందేశాలు బంద్