కరోనా మహమ్మారితో ఇటీవలి కాలంలో ఎక్కువగా 30 నుంచి 40 ఏళ్ల మధ్య వారే మృతి చెందుతున్నట్లు సమాచారం. కరోనా ఎక్కువగా ఊపిరితిత్తులపై... తర్వాత గుండెపై ప్రభావం చూపిస్తుందని వైద్యులు తెలుపుతున్నారు. ఈ కారణంగానే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయంటున్న ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేష్ గూడపాటితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
'కరోనా ప్రభావంతో మరణాలు ఏ దశలోనైనా ఉండవచ్చు' - గుండెపై కరోనా ప్రభావం
కరోనా మహ్మమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఉద్ధృతంగా విస్తరిస్తోంది. భారత్లో కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో వేల మంది వైరస్ భారీన పడుతున్నారు. చికిత్స పొందుతూ కొంత మంది అకాల మరణానికి గురువతున్నారు. ఇందుకు గల కారణాలు ఏమిటి? కరోనా వల్ల అకాల మరణం సంభవించడం తప్పదా?
'కరోనా ప్రభావంతో మరణాలు ఏ దశలోనైనా ఉండవచ్చు'