తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలోని కమ్మిరెడ్డిపాలెంలో ఓ కారు అగ్ని ప్రమాదానికి గురైంది. ప్రసన్నకుమార్ తన కుమార్తె, తమ్ముడు కుమారుడితో కారులో బయటకు వెళ్లి వస్తుండగా కారు ముందుభాగంలో పొగలు వచ్చాయి. వెంటానే అప్రమత్తమైన ప్రసన్నకుమార్ పిల్లలను బయటకి దింపేశారు. మంటలు పూర్తిగా వ్యాపించి కారు పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు అపుదు చేశారు. విద్యుత్ షార్టు సర్య్కూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.
కారులో మంటలు.. తప్పిన ప్రమాదం - విద్యుత్ షార్టు సర్య్కూట్ వల్ల ప్రమాదం
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలోని కమ్మిరెడ్డిపాలెం వద్ద ఓ కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్టు సర్య్కూట్‌తో ప్రమాదం జరిగి ఉండొచ్చనని భావిస్తున్నారు.
కారులో మంటలు..తప్పిన ప్రమాదం