తెలంగాణ

telangana

ETV Bharat / state

2023 ఎన్నికల్లో.. భాజపా గెలుపే లక్ష్యంగా.. - hyd bjp state level meating updates

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భాజపా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని బోయిన్‌పల్లి రాజరాజేశ్వరి గార్డెన్‌లో ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం జరగనున్న ఈ సమావేశానికి ముఖ్య నేతలు రానున్నట్లు కమలం నేతలు తెలిపారు.

Cantonment BJP leader Jampana Pratap said that a state executive meeting will be held tomorrow to strengthen the BJP across the state.
2023 ఎన్నికల్లో.. భాజపా గెలుపే లక్ష్యంగా

By

Published : Jan 16, 2021, 9:59 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతమయ్యే క్రమంలో భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం సమావేశం కానుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కాషాయ జెండాని ఎగురవేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటుచేశారు. సికింద్రాబాద్‌ పరిధిలోని బోయిన్‌పల్లి రాజరాజేశ్వరి గార్డెన్‌లో ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది.

ముఖ్య అతిథులుగా..

భాజపా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథులుగా భాజపా తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు పార్టీ ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు ఆ పార్టీ శ్రేణులు స్పష్టం చేశాయి.

'రేపు జరగబోయే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పార్టీని గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ విధంగా బలోపేతం చేయాలనే అంశంపై పూర్తిస్థాయిలో చర్చిస్తారు. 2023 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమావేశం సాగుతుంది.

-జంపన ప్రతాప్, కంటోన్మెంట్ భాజపా నాయకుడు

ఇదీ చదవండి:కరడుగట్టిన నేరస్థుడు బాఖర్‌ అలీ అరెస్టు

ABOUT THE AUTHOR

...view details