తెలంగాణ

telangana

ETV Bharat / state

మహారాష్ట్రకు గంజాయి సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్ - cannabis news

సినిమాను తలపించేలా ఓ ముగ్గురు వ్యక్తులు గంజాయి సరఫరా చేస్తుండగా... పోలీసులకు చిక్కారు. వారి నుంచి 300 కిలోల గంజాయి, కారు, 1.50 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.

cannabis-supplying-gang-arrested-in-hyderabad
మహారాష్ట్రకు గంజాయి సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్

By

Published : Mar 4, 2020, 7:21 PM IST

మహారాష్ట్రకు గంజాయి సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్

హైదరాబాద్​కు చెందిన ముగ్గురు వ్యక్తులు విశాఖలోని మరో ఇద్దరి నుంచి గంజాయి సేకరించి... మహరాష్ట్రకు సరఫరా చేస్తుండగా రాచకొండ పోలీసులకు చిక్కారు. వారి నుంచి 300 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

అసలేం జరిగిందంటే...

రంగారెడ్డి జిల్లాకి చెందిన భాస్కర్​, ప్రకాశ్​లు హయత్​నగర్​లో మైకార్​ అనే పేరుతో ఒక ట్రావెల్స్​ నడుపుతున్నారు. సూర్యాపేటకు చెందిన రమావత్​ పాండు వీరికి పరిచయమయ్యాడు. నిత్యం పాండుకి అద్దె పద్ధతిలో కారు ఇస్తుంటారు. కారు తీసుకెళ్లినప్పుడుల్లా వెయ్యి కిలోమీటర్లు రీడింగ్​ ఉంటుంది. అద్దె డబ్బులు కూడా అడిగినంత చెల్లించేవారు.

జీపీఎస్​ సిస్టమ్​తో...

ఇది చూసి భాస్కర్​, ప్రకాశ్​లు పాండును ఏం చేస్తుంటావు... కారును ఎక్కడికి తీసుకువెళ్తుంటావు అని అడిగారు. పాండు సమాధానం చెప్పకపోవడం వల్ల ఎలాగైనా అతను ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలని అనుకున్నారు. అతనికి ఇచ్చే కారులో జీపీఎస్​ సిస్టమ్​ను అమర్చారు. దీనితో అతను విశాఖపట్నం ఏజెన్సీ వైపు వెళ్లి... మళ్లీ మహారాష్ట్రకు వెళ్తున్నట్లు గుర్తించారు. అతను గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించి నిలదీశారు. అందులో తమకి వాటా ఇవ్వకపోతే పోలీసులకు చెప్తామని బెదిరించగా... పాండు దీనికి ఒప్పుకున్నాడు. ముగ్గురు కలిసి గంజాయి సరఫరా చేయడం మొదలు పెట్టారు.

మహారాష్ట్రకు సరఫరా

విశాఖలోని కొర్రవాసు, సురేశ్​ల వద్ద గంజాయిని సేకరించి మహారాష్ట్రలోని కరణ్​ పర్కలే అనే వ్యక్తికి డెలివరీ చేసేవారు. నిన్న 300 కిలోల గంజాయిని 10 కిలోల ప్యాకెట్లగా చేసి కారులో హైదరాబాద్​ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తుండగా... అబ్దుల్లాపూర్​మెట్​ వద్ద ఎస్​ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్ట్​ చేసిన పోలీసులు వారి నుంచి 300 కిలోల గంజాయిని, కారును, 1.50 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

విశాఖలోని ఇద్దరితో పాటు మహారాష్ట్రలోని కరణ్​ కోసం పోలీసులు గాలిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ 35 లక్షలు ఉంటుందని పోలీసులు వివరించారు.

ఇవీ చూడండి:'కరోనా ఎఫెక్ట్: షేక్ హ్యాండ్ వద్దు.. నమస్కారం చాలు'

ABOUT THE AUTHOR

...view details