గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. బస్తీ ఎన్నికలను పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. బల్దియాపై తమ జెండా ఎగురవేసేందుకు ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. సవాళ్లు.. విమర్శలు.. ప్రతి విమర్శలతో మారుమోగిన మైకులు మూగబోయాయి. రాజకీయ పార్టీలు ఎత్తులు పైఎత్తులతో ముందుకు వెళ్లాయి. ప్రతికూలంగా ఉన్న పరిస్థితులను సైతం అనుకూలంగా మార్చుకొని ఓటర్లను అభ్యర్థించారు.
డిసెంబర్ 1న పోలింగ్...
15 రోజులపాటు హోరాహోరీగా ప్రధాన పార్టీలు ప్రచారం చేశాయి. డిసెంబర్ 1న పోలింగ్ జరగనుండగా... 4న ఓట్ల లెక్కింపు చేపడతారు. మంగళవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. జీహెచ్‌ఎంసీలో మొత్తం 150 డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. 1,122 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో ఈసారి జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గ్రేటర్లోని 9,101 పోలింగ్ కేంద్రాల్లో ఓటు ఎలా వేయాలో వివరిస్తూ వీడియో ద్వారా ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు.
74 లక్షల ఓటర్లు...
ఎన్నికల బరిలో తెరాస నుంచి 150 మంది, భాజపా నుంచి 149 మంది, కాంగ్రెస్ నుంచి 146 మంది, తెదేపా నుంచి 106 మంది, ఎంఐఎం నుంచి 51 మంది, సీపీఐ నుంచి 17 మంది అభ్యర్థులు, 12 మంది సీపీఎం, 415 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. జీహెచ్‌ఎంసీలో మొత్తం 74 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు.
అత్యధికంగా జంగమ్మెట్లో 20 మంది..