వ్యవసాయ రంగ (Agriculture) బలోపేతమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఆ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (Minister Nirajan Reddy) అన్నారు. హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో వ్యవసాయ రంగంపై తన అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్ (Ktr), సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్, జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకుపలతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు, ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ నీరజా ప్రభాకర్, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ రామకృష్ణారెడ్డి, విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు, ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి, ఆగ్రోస్ సంస్థ ఎండీ కె.రాములు ఈ సమావేశానికి హాజయ్యారు.
వ్యవసాయం వైపు...
రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతుల బలోపేతం, ఆదాయాలు పెంపు, పంటల మార్పిడి, యువతను వ్యవసాయం వైపు మళ్లించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం, మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపరచడం, పథకాల అమలుతీరుపై చర్చించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత ఇష్టమైన వ్యవసాయ రంగం అని... అత్యధిక శాతం ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగంలో రాబోయే తరాలను ఈ రంగం వైపు నడిపించాల్సిన అవసరం ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 35 లక్షల పంపుసెట్లకు 24 గంటల ఉచిత కరెంట్ సరఫరా చేస్తుంటే... అదే ఉత్తర్‌ప్రదేశ్‌లో కరెంట్‌పై 5, 6 లక్షల మోటార్లు, 30, 35 లక్షల మోటర్లు డీజిల్‌తో రైతులు ఇంజిన్లు నడుపుకుంటున్నారని మంత్రి తెలిపారు.